నేడు కపిల్ దేవ్ రాక
జేవిఆర్ జే బ్రాండ్ అంబాసిడర్ కపిల్ దేవ్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రముఖ క్రికెట్ దిగ్గజం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కపిల్ దేవ్, వివిఎస్ లక్ష్మణ్, ఎంఎస్ కే ప్రసాద్ లు హైదరాబాద్ రానున్నారు. రియల్ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న జై వాసవీస్ ఆర్ జే గ్రూప్ లోగో, బ్రోచర్లను ఈనెల 20న హైదరాబాద్ లోని ఐటీసి కోహినూరులో ఆవిష్కరించనున్నారు.

తొలుత పటాన్ చెరువు – కద్దనూరులో జైవాసవీస్ ఓఆర్ ఆర్ హైట్స్, ఘట్ కేసర్ – యాంనాంపేటలోని జై వాసవీస్ బ్లిస్ అపార్ట్ మెంట్ నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు.

పూర్తి స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో డబుల్, త్రిబుల్, నాలుగు గదులు కల్గిన లగ్జరీ ప్లాట్ లు నిర్మించ తలపెట్టినట్లు జై వాసవీస్ ఆర్ జే గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి హెచ్ భాస్కర్ రామ్ గుప్త, సుధారాణి గుప్తలు తెలిపారు.

షేటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్స్, ఎసి జిమ్, వాకింగ్ ట్రాక్, ఫార్మసీ, మినీ సూపర్ మార్కెట్, డ్రింకింగ్ వాటర్ లైన్, చెస్, క్యారమ్, మల్టీ ఫర్పస్ హాల్ తదితర సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. కస్టమర్లకు అత్యంత ఆధునాతన సదుపాయాలతో పాటు లక్కీ డిప్, బొనంజాల ద్వారా రాయితీ పొందే వీలుందని చెప్పారు.