పేదలకు అండ బిఎల్ఆర్

*పేదలకు అండ బిఎల్ఆర్

శ్రీ శ్రీనివాస కళ్యాణ కానుక

*మాజీ సర్పంచ్ రేగట్టే రవీందర్ రెడ్డి

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ బ్రదర్స్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పేదింటి ఆడపడుచుల వివాహాల సందర్భంగా అందిస్తున్న శ్రీనివాస కళ్యాణ కానుక పేదలకు అండగా ఉంటుందని వేములపల్లి మాజీ సర్పంచ్ రేగట్టే రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కీ.శే.వెంకన్న,రంగు నాగమణి కుమార్తె కావ్య,సోనీ-హరికృష్ణ ల వివాహం సందర్భంగా బిఎల్ఆర్ బ్రదర్స్ అందించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ కానుకను శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టల పెద్దవెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతంగి చంటి, పుట్టల యాదగిరి,షేక్ నవీద్,మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ మహమూద్,పగడాల నాగయ్య, ముబిన్, సజ్జు, జావేద్, పగడాల రాకేష్, జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking