రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతితో ఏడుకు చేరిన మృతుల సంఖ్య
*కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఎపి రాష్ట్రం గుంటూరు జిల్లా పొందుగల వద్ద జరిగిన బుధవారం ప్రమాద స్థలిలో ఆరుగురు మరణించగా, మరొకరు గురువారం మరణించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం కు చెందిన మహిళా కూలీలు మిర్చి ఏరెందుకు ఆటోలో బుధవారం వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఆరుగురు ప్రమాదం స్థలంలో మరణించగా మరొకరు మాలోతు దేవి మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. బుధవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆమెను పరామర్శించి ధైర్యం ఇచ్చారు. ఆమె మృతితో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శుక్రవారం దేవి మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే భాస్కర్రావు ఉండి పోస్టుమార్టం నిర్వహించిన జేసి నర్సాపురం గ్రామానికి తరలించారు. ఎమ్మెల్యే కూడా గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో ఆగ్రోస్, ట్రైకర్ చైర్మన్లు తిప్పన విజయసింహారెడ్డి, ఈ.రాంచందర్నయక్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ డి.నారాయణరెడ్డిలు పాల్గొన్నారు.