ఫిషరీస్ ఛైర్మన్ గా పిట్టల రవీందర్ నియామకంతో అనంతరాములు హర్షం
-బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిరాజ్ లకు కీలక పదవులు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ గా పిట్టల రవీందర్ నియామకం పట్ల ముది రాజ్ సంఘం ఫౌండర్ కాశబో యిన అనంతరాములు హర్షం వ్యక్తం చేశారు.నిన్న ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముదిరాజ్ ముద్దు బిడ్డ అయిన పిట్టల రవీందర్ ను తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ గా నియమించి నందుకు ముదిరాజ్ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా ముదిరాజ్ సంఘం మరొక ఫౌండర్ అయి న పిట్టల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ జె.ఏ.సి. కో- ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తెలంగాణ సాగర మానవహారం నిర్వహించిన ఘనుడు మరియు సకల జనుల సమ్మెలో కీలకపాత్ర పోషించి ఎన్నో పోలీస్ నిర్భందాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనదైన పాత్ర పోషించినందుకు ఫలితమే ఈ ఫిషరీస్ ఛైర్మన్ పదవి దక్కిందని అన్నారు ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు మామిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్ లను గుర్తించి పదవులను ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ పాలనలో భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రికి మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యు లు పువ్వాడ అజయ్ కుమార్ కు బండా ప్రకాష్ ఎమ్మెల్సీ కు బిఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పిట్టల వెంకట నరసయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ లు అంతా ఐక్యంగా ఉండి మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బొమ్మకంటి సైదులు ముదిరాజ్ వార వెంకటేశ్వర్లు ముదిరాజ్ పందుల ఉపేందర్ ముదిరాజ్ తవడబోయిన కృష్ణ ముదిరాజ్ పిట్టల శ్రీకాంత్ ముదిరాజ్ కాశబోయిన కోటేశ్వరరావు ముదిరాజ్ పోతనబోయిన ఉపేందర్ బాషబోయిన ఉపేందర్ సాంబ కొప్పెర సాయిరామ్ వేముల నరేష్ ఐతనబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.