చదరంగంలో చిచ్చరపిడుగు ‘ప్రణీత్’

చదరంగంలో చిచ్చరపిడుగు ‘ప్రణీత్’
* మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలి
* అభినందన సభలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

జాతీయ స్థాయి చదరంగంలో మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల ప్రణీత్ చిచ్చరపిడుగు అని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభివర్ణించారు.

ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించడం మిర్యాలగూడ నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. ప్రణీత్ మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు.

ఆదివారం ఆలగడప గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రణీత్ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాక్స్ చైర్మన్ రామకృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking