దేశానికి రాజీవ్ సేవలు చిరస్మరణీయం

*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి వేములపల్లి అక్షిత ప్రతినిధి:

భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని ఆదివారం ఎంపిపి పుట్టల సునీతకృపయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా మండలంలోని శెట్టిపాలెం గ్రామంలోని భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ పుట్టల సునీత- కృపయ్య మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని ఆయన ఆశయాలనుసాధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలకృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోపిసిసి సభ్యుడు చిరుమర్రి కృష్ణయ్య,ఎంపిటిసి పల్లా వీరయ్య,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, మాజీ సర్పంచులు నాగవల్లి మధు, రేగట్టే రవీందర్ రెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ పుట్టల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు పల్లా వెంకటయ్య, మండల మహిళాఅధ్యక్షురాలు పల్లా సోమమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూసిరెడ్డి వెంకట్ రెడ్డి,బొడ్డు వీరయ్య, పుట్టలపెద్ద వెంకన్న, గౌరు రమేష్ ,పల్లా అశోక్, బొంత పుల్లయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking