ఖమ్మంలో ఖానాపురం పండ్ల మార్కెట్ యార్డుకు రూ.17.72 కోట్లు నిధులు మంజూరు
–మంత్రి తుమ్మల చిత్రపటానికి క్షీరాభిషేకం
-రోడ్లపై పండ్ల విక్రయాలతో ఇబ్బందులకు ఊరట
–ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన యూనియన్ నాయకులు
-మీడియా సమావేశంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అశ్రీఫ్ ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ జానిమియా ఏటుకూరి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు గరగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో ఖానాపురం ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ యార్డు అభివృద్ధికి రూ.17.72 కోట్ల నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పండ్ల వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. ఖానాపురం హవేలీలోని మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత రావు కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అశ్రీఫ్ మాట్లాడుతూ మంత్రి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మార్కెట్ యార్డు పనులు తిరిగి ఊపందుకున్నాయని తెలిపారు. అనంతరం ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
గతంలో మార్కెట్ యార్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో పండ్ల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ జానిమియా కార్యదర్శి ఏటుకూరి శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షుడు గరగ శ్రీనివాస్ తెలిపారు.

ప్రస్తుత నిధులతో మార్కెట్ యార్డులో మొత్తం 31 అభివృద్ధి పనులు చేపట్టనున్నారని షాపింగ్ కాంప్లెక్స్‌లు ట్రేడర్స్ షాపులు కవర్ షెడ్లు ఎలక్ట్రానిక్ వెయింగ్ బ్రిడ్జి రైతుల విశ్రాంతి భవనం మరుగుదొడ్లు తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతులు కల్పించనున్నారని వివరించారు.మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీ ఫ్లోరింగ్ అంతర్గత రహదారుల అభివృద్ధి కాంపౌండ్ వాల్ టవర్ లైట్లు విద్యుదీకరణ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మార్కెట్ పూర్తయితే రోడ్లపై పండ్ల విక్రయాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు వ్యాపారులు రైతులు వినియోగదారులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మార్కెట్ అభివృద్ధితో పండ్ల వ్యాపార కార్యకలాపాలు మరింత క్రమబద్ధంగా సాగుతాయని అన్నారు.
మధ్యలో నిలిచిపోయిన మార్కెట్ యార్డు నిర్మాణాన్ని పూర్తి చేసి వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అశ్రీఫ్ చేసిన కృషికి అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర రావు కోశాధికారి ఉస్మాన్ గౌరవ సలహాదారులు అన్నపు మల్లికార్జున్ ఖాసీం కరీం తదితరులు పాల్గొన్నారు.