ఆచార్యుల గూడెంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
చిలుకూరు, ఆగస్టు 20 (అక్షిత న్యూస్):
మండల కేంద్రంలోని ఆచార్యుల గూడెంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీకి పూలమాలలతో పుష్పాంజలి ఘటించి, దేశాభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు