ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
రాయపర్తి అక్షిత ప్రతినిధి
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయపర్తి టౌన్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మచ్చ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, దేశాభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర-బిక్షపతి, టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుదీర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందికట్ల యాకయ్య, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ అఫ్రోజ్ ఖాన్‌తో పాటు మండల ముఖ్య నాయకులు, యువజన నాయకులు పాల్గొని ఘన నివాళులర్పించారు.