బ్యాంక్ అధికారులు పోర్టల్ లో దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలి
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జీవన్
వర్ధన్నపేట అక్షిత ప్రతినిది
వర్ధన్నపేట బ్లాక్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాలకు సంబంధించిన జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జీవన్ ముఖ్యఅతిథిగా హాజరై బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడం, వ్యవస్థాపకత, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్ రుణాలు అందించడంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం, సామాజిక భద్రతా పథకాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక అక్షరాస్యత కేంద్రం పోస్టర్‌ను సమావేశంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎంపీడీవో రాజ్యలక్ష్మి మూడు మండలాల ఏపీఎంలు మూడు మండలాల్లోని వివిధ బ్యాంకుల మేనేజర్లు లీడ్ బ్యాంక్ ఆఫీసర్ రవి లీడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ భాస్కర్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు మణికాంత్ యాకూబ్ పాషా సెర్ఫ్, మెప్మా సీసీలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.