అక్రమంగా తరలిస్తున్న 144.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…
వాహనం సీజ్ ముగ్గురిపై కేసు నమోదు…
లోకేశ్వరం, ఆగస్టు 19 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అక్రమంగా తరలిస్తున్న భారీ రేషన్ బియ్యం వాహనాన్ని లోకేశ్వరం ఎస్సై ప్రదీప్, పట్టుకున్నారు. భైంసా నుంచి సాద్‌గాం వైపునకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.రాత్రి 10:30 గంటల సమయంలో ఆ మార్గంలో వస్తున్న టీఎస్ 16 యూబీ 7616 నంబరు గల వాహనాన్ని ఆపి సోదా చేశారు. అందులో 289 సంచుల్లో నిల్వ ఉంచిన 144.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అధికారులు పంచనామా నిర్వహించి,బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్వరం పోలీసులు కేసు (క్రైం నంబర్ 101/2026) నమోదు చేశారు.దొడ్ల సాయికుమార్,అబ్దుల్ మోసిన్,అబ్దుల్ నసీర్,లపై బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4)తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం (6ఏ/7 ఈసీ యాక్ట్) కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రదీప్,తెలిపారు.ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర సూత్రధారుల వివరాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు…