ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా నోముల చిరంజీవి మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా నోముల చిరంజీవి మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

రెండోసారి బాధ్యతలు చేపట్టిన చిరంజీవి

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

ఎమ్మార్పీఎస్‌ రామన్నపేట మండల అధ్యక్షుడిగా నోముల చిరంజీవి మాదిగ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామన్నపేట మండల కేంద్రంలోని ఎన్‌వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌–ఎంఎస్‌పీ మండల కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నోముల చిరంజీవి మాదిగను మరోసారి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ ఆశయ సాధన కోసం, మాదిగల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేస్తానని చిరంజీవి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీని బలోపేతం చేసి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు, ఎంఎస్‌పీ ప్రతినిధులు, యువసేన నాయకులు, వివిధ గ్రామాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking