బాధిత కుటుంబానికి మాజీ జడ్పీ చైర్మన్ పరామర్శ…

బాధిత కుటుంబానికి మాజీ జడ్పీ చైర్మన్ పరామర్శ…

లోకేశ్వరం, ఆగస్టు 19అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన గౌతమి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్,బుధవారం పరామర్శించారు.మన్మద్‌లోని బాధిత నివాసానికి చేరుకున్న ఆయన,మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.గౌతమి మరణం తీవ్ర విచారకరమని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్, పార్టీ నాయకులు చిన్న బోజారెడ్డి, రాజన్న, అనిల్, సందీప్, ప్రవీణ్, శ్రీను, కధం గణేష్, టేకు శ్రీను తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking