సెప్టెంబర్ 9న చలో వరంగల్‌ను విజయవంతం చేయాలి
– అసమానతలు లేని సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యం
– యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జి బిర్రు మహేందర్ మాదిగ
– ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా నోముల చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నిక
రామన్నపేట అక్షిత ప్రతినిధి
సెప్టెంబర్ 9న వరంగల్ వేదికగా నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్–ఎంఎస్‌పీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జి బిర్రు మహేందర్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎన్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మార్పీఎస్–ఎంఎస్‌పీ రామన్నపేట మండల కమిటీ సమావేశం నిర్వహించారు. మండల ఇన్‌చార్జి నల్ల స్వామి మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బిర్రు మహేందర్ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న జాతీయ మహాసభకు రామన్నపేట మండలం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదిగ జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం మందకృష్ణ మాదిగ 33 ఏళ్లుగా నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యమని, మాదిగలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. అనంతరం నూతన మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు.
నూతన మండల కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా నోముల చిరంజీవి మాదిగ, అధికార ప్రతినిధిగా మేడి కృష్ణ మాదిగ, ఉపాధ్యక్షుడిగా బందెల నరసింహులు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా కక్కిరేణి రవీందర్ మాదిగ, కార్యదర్శులుగా కొండగడప చింటూ మాదిగ, బందెల వెంకన్న మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడిగా బొడ్డు శంకరయ్య మాదిగ, అధికార ప్రతినిధిగా వంగాల మారయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మంటి మల్లేష్ మాదిగ, యువసేన మండల అధ్యక్షుడిగా మేడి నవీన్ మాదిగలను ఎంపిక చేశారు. జిల్లా కమిటీకి దండోరా మల్లేష్ మాదిగ, నల్ల స్వామి మాదిగలను, ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీకి నోముల విష్ణు మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షుడు, భువనగిరి నియోజకవర్గ నాయకుడు దుబ్బ రామకృష్ణ మాదిగ, దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు నకిరకంటి మొగులయ్య మాదిగ, ఉద్యోగుల రాష్ట్ర నాయకుడు బొడ్డు సురేందర్ మాదిగ, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, దుబ్బాక మాజీ సర్పంచ్ గట్టు యాదయ్య మాదిగ, మంద చంద్రయ్య మాదిగ, నోముల ప్రవీణ్ మాదిగ, నోముల కృష్ణ మాదిగతో పాటు ఆయా గ్రామాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.