రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
క్యాతనపల్లి సమీపంలోని భారత్ నగర్ వద్ద ఎన్ హెచ్ -363 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన నూకల సంతోష్ కుమార్ (22)మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం సంతోష్ కుమార్ తన మోటార్‌సైకిల్‌పై శ్రీరాంపూర్ వైపు నుంచి క్యాతనపల్లి వైపు వెళ్తుండగా, అధిక వేగంతో నిర్లక్ష్యంగా రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న బొలెరో ట్రాలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంతోష్ రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం అనంతరం ఇరు వాహనాలు మంటలకు గురై పూర్తిగా దగ్ధమయ్యాయి. తీవ్రంగా గాయపడిన సంతోష్ కుమార్‌ను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు.మృతుడి తల్లి నూకల సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.