ఛాతీ వ్యాధుల చికిత్సలో ఆధునిక శస్త్ర చికిత్సలు

ఛాతీ వ్యాధుల చికిత్సలో ఆధునిక శస్త్ర చికిత్సలు

మినిమల్లీ ఇన్వాసివ్‌, రోబోటిక్‌ సర్జరీలతో మెరుగైన ఫలితాలు

సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌ థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సి.రోహన్‌రెడ్డి 

సూర్యాపేట , అక్షిత ప్రతినిధి :

ఛాతీకి సంబంధించిన సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో మినిమల్లీ ఇన్వాసివ్‌,రోబోటిక్‌ సర్జరీలు కీలకంగా మారాయని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌ థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రోహన్‌రెడ్డి.సి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మినిమల్లీ ఇన్వాసివ్‌, రోబోటిక్‌ సర్జరీల గురించి వివరించారు. ఊపిరితిత్తులు,అన్నవాహిక,ఛాతీలోని కణితులు తదితర వ్యాధులకు వాట్స్ , రాట్స్ వంటి ఆధునిక పద్ధతులతో చిన్న కోతల తోనే శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దీనివల్ల నొప్పి, ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గడంతో పాటు రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు.వ్యాధిని తొలి దశలో గుర్తించి,వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు. తద్వారా రోగి త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటాడని స్పష్టం చేశారు.ఈ వ్యాధులను గుర్తించి వీడియో కెమెరా సహాయంతో చేసే సర్జరీ,రోబోట్ సహాయంతో చేసే సర్జరీ వంటి పద్ధతుల ద్వారా చిన్న రంధ్రం ద్వారా ఆపరేషన్లు విజయవంతంగా చేయడం జరుగుతోందని వివరించారు.ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ మేనేజర్‌ ఉమేష్‌,అసిస్టెంట్‌ మేనేజర్‌ రాంప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking