సీనియర్ పాత్రికేయుడు మొహమ్మద్ ఇబ్రహీం సంతాప సభ 24న
రామన్నపేట, అక్షిత ప్రతినిధి
ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయుడు మొహమ్మద్ ఇబ్రహీం సంతాప సభను ఈనెల 24వ తేదీ సోమవారం రామన్నపేట మండల కేంద్రంలోని దుర్గయ్య కాంప్లెక్స్‌లో గల మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు సీనియర్ పాత్రికేయులు కనతాల శశిధర్ రెడ్డి, బూరుగు వెంకటేశం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొహమ్మద్ ఇబ్రహీం 1975 నుంచి 2026 వరకు సుమారు 51 సంవత్సరాల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారని వారు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి, నిబద్ధతతో పాత్రికేయ వృత్తిని కొనసాగించిన ఇబ్రహీం సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఇబ్రహీంతో అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు, మిత్రులు, తోటి పాత్రికేయులు సంతాప సభకు హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించాలని కనతాల శశిధర్ రెడ్డి, బూరుగు వెంకటేశం కోరారు.