మూసి పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలు అందించాలి
– సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని మూసి పరివాహక ప్రాంతానికి మూసీ నీటికి బదులుగా గోదావరి జలాలను అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య అన్నారు. ఆగస్టు 29 నుండి 30 వరకు జరిగే సిపిఎం పాదయాత్ర ఇందిరా పార్కు వద్ద మహాధర్నాల ను విజయవంతం చేయాలని కోరుతూ రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా మాట్లాడుతూ రామన్నపేట మండలంలోని రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మూసీ నీటికి బదులుగా గోదావరి జలాలను అందించాలని,పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆగస్టు 29,30,31 తేదీలలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకై జరిగే సిపిఎం జిల్లా పాదయాత్ర ఇందిరా పార్కు వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని పాదయాత్రలో రైతులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అలాగే ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్ మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్ సిపిఎం గ్రామ శాఖ నాయకత్వం బండ జగన్మోహన్ రెడ్డి, నేమనంది లింగయ్య, బోయిని మల్లేష్, గోగు లింగస్వామి,నాగటి ఉపేందర్, బోయిని రామచంద్రం, ఆవుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.