40 ఏళ్ల అనుబంధం.. ఇబ్రహీం మృతి బాధాకరం

40 ఏళ్ల అనుబంధం.. ఇబ్రహీం మృతి బాధాకరం

– సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇబ్రహీంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని సీపీఐ(ఎం) పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు తెలిపారు. ఇబ్రహీం అనారోగ్యంతో మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను రామన్నపేట డివిజన్ సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటి నుంచే ఇబ్రహీం తనకు సుపరిచితుడని తెలిపారు. ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక వార్తలను ఇబ్రహీం తన పత్రికలో ప్రచురించి ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిన ఇబ్రహీం, ఏదైనా వార్తా అంశం తన దృష్టికి వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులను సంప్రదించి, అనేక కోణాల్లో వివరాలు సేకరించి, నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే వార్తలు రాసేవారని సీతారాములు తెలిపారు. ఇబ్రహీం మృతి జిల్లా పాత్రికేయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking