****ఆదర్శనగర్ కాలనీలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి బోనాల జాతర
రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయం నందు , పోచమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదర్శనగర్ కాలనీవాసులు, పట్నం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అదేవిధంగా భక్తులు అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి, మేళ తాళాలతో, పోతురాజుల విన్యాసాలతో, శివసత్తుల నాట్యాలతో, అధిక సంఖ్యలో వచ్చి బోనాల సమర్పించి, వారు మొక్కులను చెల్లించుకొని,పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శనగర్ కాలనీవాసులు, కౌన్సిలర్లు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.