****వీర పట్నంలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ ఊర పోచమ్మ తల్లి బోనాల జాతర
***ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీశ్రీశ్రీ ఊర పోచమ్మ దేవాలయం నందు , ఊర పోచమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని , దేవాలయ కమిటీ సభ్యులు పగడాల రాము శాలువాతో సత్కరించడం జరిగింది., పట్నం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ముత్యాల భాస్కర్ మాట్లాడుతూ భక్తులు అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి, మేళ తాళాలతో, పోతురాజుల విన్యాసాలతో, శివసత్తుల నాట్యాలతో, అధిక సంఖ్యలో వచ్చి బోనాల సమర్పించి, వారి మొక్కలను చెల్లించుకున్నారు. హాజరైన ప్రతి భక్తులకు, అమ్మవారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. బోనాల జాతర ఉత్సవాలకు సహకరించిన దేవాలయ కమిటీ సభ్యులకు,భక్తులందరూ భక్తిశ్రద్ధలతో అత్యధిక సంఖ్యలో పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేసినందుకు గాను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బి ఆర్ ఎస్ నాయకులు ముత్యాల చిన్న, శివ సాయి, కంచ కట్ల భాస్కర్, ముత్యాల రవి, ధనరాజ్,తదితరులు పాల్గొన్నారు.