పోచమ్మ తల్లి బోనాల జాతర

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి బోనాల జాతర

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి :

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బృందావన్ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయం నందు , పోచమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ (మామ) ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈసి శేఖర్ గౌడ్ ను , దేవాలయ కమిటీ చైర్మన్ ఆకుల ఆనంద్ కుమార్ శాలువాతో సత్కరించడం జరిగింది. బృందావన్ కాలనీవాసులు, పట్నం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ భక్తులు అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి, మేళ తాళాలతో, పోతురాజుల విన్యాసాలతో, శివసత్తుల నాట్యాలతో, అధిక సంఖ్యలో వచ్చి బోనాల సమర్పించి, వారి మొక్కలను చెల్లించుకున్నారు. హాజరైన ప్రతి భక్తులకు, అమ్మవారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. బోనాల జాతర ఉత్సవాలకు సహకరించిన కాలనీవాసులకు,భక్తులందరూ భక్తిశ్రద్ధలతో అత్యధిక సంఖ్యలో పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేసినందుకు గాను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల మమత, మోహన్ నాయక్, త్రిలోక్ కుమార్, రామ్ రెడ్డి, యంపళ్ళ సుధాకర్ రెడ్డి, భాస్కర్ నాయక్, ముత్యాల శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking