యూపిఐ లావాదేవీలపై నిఘా
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున బ్యాంక్ లలో అనుమానాస్పద, నగదు తరలింపుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ బ్యాంక్ కంట్రోలర్ లతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.10 లక్షల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్,జిల్లా యంత్రాంగానికి రోజువారీగా సమాచారం అందించాలని అన్నారు.అదే విధంగా అనుమానాస్పద లావాదేవీలపై కూడా ప్రతి రోజు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోటీ చేయనున్న అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ లు త్వరగా తెరచి మానిటరింగ్ చేయాలని అన్నారు.
యూపిఐ ద్వారా పలు లావాదేవీలు జరిపిన అకౌంట్ లు మానిటర్ చేయాలని,అందుకు సంబంధించిన నివేదిక సంబంధిత బ్యాంక్ ప్రధాన శాఖ నుండి సేకరింఛాలని,సమాచారం జిల్లా అధికారులకు అందించాలని అన్నారు.

బ్యాంక్ లు ఒక బ్రాంచ్ నుండి నుండి మరో బ్రాంచికి, ఏ.టి.యం.లో లోడింగ్ చేసేప్పుడు బ్యాంక్ లు సరైన డాక్యు మెంట్ లు,గుర్తింపు కార్డ్ కలిగి ఉండాలని అన్నారు. ఏ.టి.యం.వెండర్ లు బ్యాంక్ కు సంబంధం లేని ఎటువంటి నగదు కల్గి వుంటే సంబంధిత బ్యాంక్ లు బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశం లో ఎల్.డి.ఎం శ్రామిక్ ,బ్యాంక్ కంట్రోలర్ లు పాల్గొన్నారు.