మండల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి.
గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారంతో మండల సమగ్రాభివృద్ధి.
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.
కోదాడ అక్షిత ప్రతినిధి:
కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చింతా కవిత రాదారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సాధారణ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారంతో కోదాడ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని .ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు సమన్వయంగా పని చేయాలని, గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న పనులను వెంటనేపూర్తి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అధికారులు ఎక్కడా అలసత్వం వహించరాదని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజా ప్రతినిధులు,అధికారులు వారధిగా వ్యవహరించి ప్రజలకు చేరువ చేయాలని ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లెల రాణి, ఎంపీడీఓ విజయ శ్రీ, ప్రజా ప్రతినిధులు,అన్ని శాఖల అధికారులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.