డ్రైనేజీ పనులను పరిశీలించిన చైర్మన్
అక్షిత, చిట్యాల :
చిట్యాల పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను బుధవారం మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించాడు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజ్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలను పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారుకు ఆదేశించాడు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి , స్థానిక కౌన్సిలర్లు రేమడాల లింగస్వామి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మే0డే సైదులు, సాగర్ల గోవర్ధన్ , పోన్నం లక్ష్మయ్య , జిట్ట చంద్రకాంత్ , జడల చిన్న మల్లయ్య, రుద్రవరం యాదయ్య, ఆవుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు…