హరితహారం చెట్లను తీసివేయడం చాలా బాధాకరం
నిర్ల్యక్షపు సమాధానంగా ఎన్ఎస్పి అధికారులు
మాతరం యూత్ సభ్యుడు శివశంకర్
నేరేడుచర్ల, అక్షిత న్యూస్:
గ్రంధాలయం ముందు ఉన్న హరితహారం చెట్లను సామాజిక బాధ్యతగా పెంచుకున్న చెట్లను ఎన్ ఎస్ పీ అధికారులు ఇష్టానుసారంగా తొలగించి రోడ్డు పైనే వేశారని, కాలువలో ఉన్న చెత్తను కూడా రోడ్డు పై పడేసి బురదమయం చేశారని, ప్రభుత్వం చెట్లను పెంచమని కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటే, కొందరు అధికారులు మాత్రం దీనిని పాటించట్లేదనీ అన్నారు. కనీసం నరికిన చెట్లను, రోడ్డుపై వేసిన చెత్తను మున్సిపల్ అధికారులకి సమాచారం అందించి తీసివేయించాలని కోరగా మాకు సంబంధం లేదు, మీరే సమాచారం ఇచ్చుకొని తీయించుకొండని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. చెట్లను మేక మేసిందని రైతుకు ఫైన్ వేసిన అధికారులు, మరి ఎన్ ఎస్ పి అధికారులపై చర్య తీసుకుంటారా అని సామాజిక కార్యకర్త మాతరం యూత్ సభ్యుడు శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. చెట్లను పెంచాలి అనే నినాదం కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిందనీ, ఎండాకాలంలో కూడా చెట్లకు మేమే నీళ్లు పోసి పెంచామని ఇలా తొలగించడం సరైనది కాదని,చెట్లను తీసివేసిన వారిపై మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.