బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటలను కలిసిన బొంగోని సురేష్ గౌడ్ -సురేష్ గౌడ్ కే టిక్కెట్ ఇవ్వాలని కోరిన కార్యకర్తలు
బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటలను కలిసిన బొంగోని సురేష్ గౌడ్ -సురేష్ గౌడ్ కే టిక్కెట్ ఇవ్వాలని కోరిన కార్యకర్తలు
చేర్యాల,అక్టోబర్ 11 అక్షిత ప్రతినిధి:
బిజెపి తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ను షామీర్పేట తన నివాసంలో ఉస్మానియా ఉద్యమకారుడు బిసి నాయకుడు డాక్టర్ బంగోని సురేష్ గౌడ్ బుధవారం జనగామ నియోజకవర్గానికి చెందిన దాదాపు 100 మంది బిజెపి కార్యకర్తలతో కలవడం జరిగింది.ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో ఉస్మానియా యూనివర్సిటీ లో అనేక ఉద్యమాలు చేసి,ఏబీవీపీ విద్యార్థి దశ నుండి ఏబివిపి లో క్రమశిక్షణ కల్గిన కార్యకర్త గా అనేక ఉద్యమాలు చేసి,జైలు జీవితం అనుభవించి తన కుటుంబాన్ని సైతం వదిలి తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. బీజేపీ లో కూడా యువకుల కోసం నిరుద్యోగుల కోసం ధర్నాలు ర్యాలీ లు రాస్తారోకో లు చేసి ఎన్నో కేసులు పాలు అయినా, బీసీ అయినా యువనాయకుడు కీ జనగామ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని అభ్యరించడం జరిగింది. ఈ విషయానికి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించండి జరిగింది.ఈ సందర్భంగా జనగామ యువత ఈటెల రాజేందర్ కి ధన్యవాదాలు తెలుపుతూ, బొంగోని సురేష్ గౌడ్ కి టికెట్ కేటాయిస్తే మొక్కవోని దీక్షతో గెలుపే లక్ష్యంగా పని చేసి కబ్జాల చేర్యాలకి విముక్తి కలిపించి,అభివృద్ధి పథంలో నడిపించేలా పనిచేస్తామని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నర్రా మహేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, సురేందర్ మరియు నియోజకవర్గం నుండి తదితరులు కలవడం జరిగింది.