మిర్యాలగూడ అసెంబ్లీకి 2,31,391 మంది ఓటర్లు

మిర్యాలగూడ అసెంబ్లీకి 2,31,391 మంది ఓటర్లు

రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ చెన్నయ్య

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో అనుబంధ జాబితా కలుపుకుని సుమారు 2,31,391 మంది ఓటర్లు ఉన్నారని మిర్యాలగూడ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ బి.చెన్నయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇందులో పురుషులు 1,13, 912మంది, మహిళలు 1,17,455 మంది, ట్రాన్స్ జెండర్ 25, సర్వీస్ ఓటర్స్ 31 మంది ఉన్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని 263 పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణకు 30 మంది సెక్టరియల్ ఆఫీసర్స్, 30 మంది రూట్ ఆఫీసర్స్, 1,841 పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. సుమారు178 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. నియోజవర్గంలోని సుమారు 1,250 మంది దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఆటో రిక్షాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. వారిని పోలింగ్ కేంద్రంలోనికి వీల్ చైర్స్ లో తీసుకెళ్లేందుకు వాలంటీర్లు నియమించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పోల్ చిట్టీల కోసం హెల్ప్ డెస్క్, ప్రాథమిక చికిత్స కోసం వైద్య సహాయ టీమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల సామాగ్రి తరలింపు కేంద్రంలో ఈ నెల 28 సాయంత్రం సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రమైన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధికారులు, సిబ్బంది పనులు ప్రారంభిస్తారని, 29న 56 బస్సుల్లో సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారని తెలిపారు. ఆయన వెంట మిర్యాలగూడ, మాడుగులపల్లి తహశీల్దార్లు హరిబాబు, ఎండి. జమీరుద్దున్ లన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking