కాంగ్రెస్ హామీలన్నీ నీటి మూటలే బిఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రగతి

కాంగ్రెస్ హామీలన్నీ నీటి మూటలే

బిఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రగతి

బడుగుల లింగయ్య యాదవ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి:

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ బూటకమని బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. సోమవారం స్థానిక వైదేహి వెంచర్ లొ బిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 14మంది సిఎం రేసులో ఉండగా నలుగురు నల్లగొండ జిల్లా నుండి ఉన్నారని ఆయన విమర్శించారు. మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు ప్రజల్లో ఉన్న మనిషని, ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉందని, అదే కాంగ్రెస్ అభ్యర్ధి కేవలం స్వచ్చంద సేవ అని నటిస్తూ ప్రజలను మోసగిస్తున్నరని విమర్శించారు. భాస్కర్ రావును కాపాడుకుంటామని, ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని, అభివృద్ధి కొనసాగిస్తామన్నారు. నియోజకర్గంలోని ప్రతి గ్రామం, హంలేట్ లో రెండు దఫాలు ప్రచారం చేశానన్నరు. కెసిఆర్ అధికారంలోకి రాగానే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking