బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
అక్షిత బ్యూరో :
అక్షిత న్యూస్ రాయపర్తి మండలంలోని బాలు నాయక్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డ్ నెంబర్ భూక్య నారంగి సందీప్ బిఆర్ఎస్ పార్టీలో చేరగా మండల కేంద్రంలోని మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాయపర్తి మండల బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహా నాయక్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు మండల పార్టీ ఉపాధ్యక్షుడు గబ్బేట బాబు ఎంపీటీసీ భూక్య గోవింద్ నాయక్ సర్పంచ్ జగన్, గ్రామ పార్టీ అధ్యక్షులు భూక్య వెంకన్న ఉప సర్పంచ్ రూపు సింగ్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.