బిఎల్ఆర్ మాతృమూర్తికి నివాళ్ళు

బిఎల్ఆర్ మాతృమూర్తి వెంకట్రావమ్మకు నివాళ్ళు

జానా, ఎమ్మెల్యే భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్ది ప్రముఖులు

భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మాతృమూర్తి బత్తుల వెంకట్రావమ్మకు కాంగ్రెస్ శ్రేణులు, బిఎల్ఆర్ అభిమానులు సోమవారం అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందిన వెంకట్రామమ్మ పార్థివదేహాన్ని సందర్శనార్థం బిఎల్అర్ నివాసంలో ఉంచారు.ఆమె పార్ధీవ దేహాన్ని వేలాది మంది సందర్శించి నివాళులర్పించారు.
మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే, మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు, సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ సిడి.రవికుమార్, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దీరావత్ స్కైలాబ్ నాయక్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, డి.మల్లేష్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గౌరు శ్రీనివాస్, వెంకటరమణ చౌదరి, డాక్టర్ మువ్వా రామారావు, డాక్టర్ జె.రాజులు వెంకట్రావమ్మ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బిఎల్ఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణుల కన్నీటి వీడ్కోల మధ్య తాళ్లగడ్డ హిందూ స్మశాన వాటికకు ఊరేగింపుగా తరలించారు. సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking