పోలింగ్ సజావుగా చేపట్టాలి

పోలింగ్ సజావుగా చేపట్టాలి

కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
శాసన సభ సాధారణ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ లు ఓటు వేయడానికి సమస్య లేకుండా అన్ని సదు పాయాలు కల్పించడం జరిగిందని,ఎక్కడ కూడా ఓటర్ లకు అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.పోలింగ్ రోజున టోల్ ఫ్రీ నంబర్ 1950 కు,సి.విజిల్ ద్వారా,ఎన్నికల కమిషన్ నుండి వచ్చిన పిర్యాదులు పై కంట్రోల్ రూం లో సి.పి. ఓ చర్యలు తీసుకోవాలని అన్నారు.పోలింగ్ రోజు జిల్లా కలెక్టరేట్ నుండి కంట్రోల్ రూం ఏర్పాటు చేసి వెబ్ క్యాష్టింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ లు, కమ్యుని కేషన్ కంట్రోల్ రూం,మీడియా మానిటరింగ్ రూం లో అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు.పోలింగ్ సామగ్రి డి.అర్.సి.నుండి పంపిణీ కి ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
పోలింగ్ సిబ్బందికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోలింగ్ రోజు సీనియర్ సిటిజన్ లు,వృద్దులకు వాహన సౌకర్యం,వాలంటీర్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking