బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

పాస్టర్ రెవరెండ్ వి యేసయ్య

కోదాడ, అక్షిత ప్రతినిధి :

స్థానిక నయా నగర్ లోని పాస్టర్ రెవరెండ్ వి యేసయ్య ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ రెవరెండ్ యేసయ్య మాట్లాడుతూ లోక రక్షకుడు యేసయ్య అని జ్ఞానులకు జ్ఞాని అని ఆయన మన హృదయంలోనే నివసిస్తాడని, సహోదర ప్రేమ క్షమాపణ గుణం ఆదరించే మనసు స్వస్థపరిచే వైద్యునిగా పాపుల రక్షకునిగా ఈ లోకంలో పవిత్రుడిగా జన్మించాడని ఆయన ప్రేమను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కోదాడ క్రిస్టియన్ మైనార్టీ కోఆప్షన్ నెంబర్ శ్రీమతి వంటపాక జానకి ఏసయ్య సూర్యాపేట జిల్లా పిఆర్టియు గౌరవ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ ఉపాధ్యక్షులు బానోతు జగ్గు నాయక్, హెడ్ కానిస్టేబుల్ జాన్ సోంపు నాగేశ్వరరావు, సెలవరాజ్ శ్రీనివాస్ మోజస్, కళ్యాణ్,మౌనిక,మేరమ్మ శారా రాంబాబు సీత భాగ్యశ్రీ ఉమా తదితరులు పాల్గొన్నారు. తదుపరి
క్రిస్మస్ కేక్ కట్ చేసిన అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking