అసెంబ్లీ గెలుపు స్ఫూర్తిని లోక్ సభలో చాటాలి

అసెంబ్లీ గెలుపు స్ఫూర్తిని
లోక్ సభలో చాటాలి

*మాజీ మంత్రి జానారెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

సంక్షేమం పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఆరోపించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అవినీతి, అక్రమాలు ఒక్కొకటిగా బయటకు తీసి ప్రజల ముందు పెడతామని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. 12 అసెంబ్లీ స్థానాల్లో 11 గెలవడంతో సీనియర్ నాయకుల, కార్యకర్తల శ్రమ ఎక్కువ ఉందన్నారు. డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ కు సముచిత స్థానం పార్టీ కల్పిస్తుందని ఆయన అన్నారు. వచ్చే మునిసిపల్ , గ్రామపంచాయితీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి అన్ని స్థానాలను, ఎంపిలను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో డిసిసి అధ్యక్షులు కేతవత్ శంకర్ నాయక్, పిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య, యాదవ్, రాష్ట్ర నాయకులు దిరవత్ స్కైలాబ్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్రెడ్డి, దామచర్ల మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస, తలకొప్పుల సైదులు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గోపగాని మాధవి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎంఎ.సలీం, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు ఎండి.ఆరిఫ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఇంజమూరి లలిత, దామరచర్ల మిర్యాలగూడ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కాకునూరి బసవయ్య గౌడ్, సీనియర్ నాయకులు, దైద సంజీవరెడ్డి, ఆవుల బక్కారెడ్డి, నారాయణ, కందుల నరసింహారెడ్డి , కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్ గౌడ్, బాలునాయక్, కె.నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking