నేనున్నానంటూ భరోసా
అక్షిత ,తిరుమలగిరి (సాగర్) :
అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపిస్తూ “అహం బ్రహ్మస్వి” అంటున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్-బుసిరెడ్డి పాండురంగారెడ్డి…
నేనున్నానంటూ భరోసా కల్పించడం,మనోధైర్యం…. మానవ సేవే మాధవ సేవ అంటూ మానవత్వంలో ప్రత్యేకత చాటుతూ… అండగా వుంటు అన్ని విధాలా ఆదుకుంటా అని చేయూతనందిస్తున్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి….నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం,తిరుమలగిరి మండలం, నేతాపురం గ్రామవాస్తవ్యులు అయినటువంటి బొలిగోర్ల నరసింహ యాదవ్ గారి వయస్సు 70 సంవత్సరాలు స్వర్గస్తులు అయ్యినారని మాకు తెలియగానే ఆ కుటుంబానికి చేయూతగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించడం జరిగింది.ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి తెలిపారు… సంప్రదించవలసినదిగా కోరడమైనది.బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ అన్నదానం కోటిగోవుల దాన ఫలితంతో సమానమైనది…దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న, మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమే.భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు అహంబ్రహ్మస్మి భావనతో నాలో దైవత్వాన్ని అలవరుచుకొని దానధర్మాలు చేస్తున్నాను అని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అన్నారు,నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…