అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

పిఎసిఎస్ చైర్మన్: పన్నాల ఎల్లారెడ్డి

గోవిందరావుపేట, అక్షిత ప్రతినిధి :

నూతన సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి ఆకాంక్షించారు.ఆదివారం మీడియాతో మాట్లాడారు కాలం అనంతమైనదని, కాలానికి అంతం లేదు, క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలుగా, మనం కాలాన్ని విభజించి లెక్కలు వేసుకొని కొత్త సంవత్సరం, వస్తుందన్నారు. గతంలో మనకు ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో తీపి గుర్తులు, కష్టసుఖాలు కలయిక జీవితం, అత్యున్నతమైన శిఖరం పక్కన అగాదమునే, లోయ ఉన్నట్లు సుఖం పక్కన కష్టాలు ఉంటాయి,కష్టాల్లో కొలిమిలో కాలినప్పుడు సుఖo విలువ తెలుస్తుందన్నారు.గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ సమీప భవిష్యత్తును దర్శిస్తూ మనం నిర్దేశించుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగడమే జీవితం, అలా రేపటి మీద ఆశతో ఆశవాహ దృక్పథంతో జీవిస్తున్న అలుపెరుగని బాటసారి లందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking