*ప్రజాపాలనను విజయవంతం చేయండి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
*ప్రజలు,అభిమానులు, కార్యకర్తలు నాకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎవరు హైదరాబాద్ కు రావొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతిష్టాత్మకంగా.. “ప్రజాపాలన” కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతీ నాయకుడు, కార్యకర్త.. గ్రామాల్లో, వార్డుల్లో ఉండి ముసలివాళ్లకు, నిరక్షరాస్యులకు, అచేతనులకు అండగా ఉంటూ వారికి తోడ్పాటు అందించి “అభయహస్తాన్ని” విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వచ్చే వారంలో నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చి ప్రతీ ఒక్కరిని కలుస్తానని తెలిపారు. నాకు ఇవ్వడం కోసం బోకేలు, శాలువాలు కొనవద్దని.. అదే డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు జమచేయాలని ప్రజలు,అభిమానులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వచ్చే ఐదేళ్లలో ప్రజాపాలన ద్వారా ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించుకుందామని. పదేళ్లుగా ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేసుకునేందుకు కలిసికట్టుగా కృషిచేద్దామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.