పార్టీ కార్యాలయాలు ప్రజలకు వారధి
ఎమ్మెల్యే పద్మావతి ఉత్తo
కోదాడ, అక్షిత ప్రతినిధి :
పార్టీ కార్యాలయాలు ప్రజలకు వారధిగా ఉపయోగపడతాయని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు ఈరోజు కోదాడ పరిధిలోని 9వ వార్డు లో వార్డు కౌన్సిలర్ మధార్ సాలార్జిన్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె పాల్గొని ప్రారంభించారు అదేవిధంగా వార్డులో ప్రజా పాలన కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు పత్రాలను నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.

6 గ్యారంటీలలో అర్హులైన వారికి కచ్చితంగా లబ్ధి చేకూరేలా చూస్తామని తెలిపారు వార్డు ప్రజలు ఎమ్మెల్యేకి కొన్ని దరఖాస్తులను అందజేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేటి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్ జానీ కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవీటి రామారావు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు సామినేని ప్రమీల రమేష్ ప్రగతి నాగేశ్వరరావు వార్డు కౌన్సిలర్ మదార్ సీనియర్ న్యాయవాది కొండల్ రెడ్డి పెండెం వెంకటేశ్వర్లు తిపిరి శెట్టి రాజు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు