*ప్రజా పాలనలో ప్రతిఒక్కరికి న్యాయం

*ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం

అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమపథకాలు
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

వేములపల్లి, అక్షితప్రతినిధి: ప్రజాపాలనలోప్రతిఒక్కరికి న్యాయంజరిగి, అర్హులైనప్రతి ఒక్కరికిసంక్షేమపథకాలుఅందుతాయనిమిర్యాలగూడఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మొల్కపట్నం, ఆమనగల్లు గ్రామపంచాయతీలలో తెలంగాణరాష్ట్రప్రభుత్వంప్రతిష్టాత్మకంగాచేపట్టినప్రజాపాలనఅభయహస్తంఆరుగ్యారెంటీలదరఖాస్తుల స్వీకరణ గ్రామసభలలో ఆయన ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో కార్యక్రమంలో అభయహస్తం అరు గ్యారెంటీ పథకాల అమలుకు అర్హులైన అబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోందన్నారు.

ఇప్పటికేమహిళలకుఉచితబస్సుప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల కుపెంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా గృహలక్ష్మి పథకంకింద ఇంటి స్థలము ఉన్న నిరుపేదలకు 5 లక్షల ఆర్ధిక సహాయం,గృహజ్యోతి పథకంతో 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్ల పెంపు , నూతన రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు లేనప్పటికి అభయహస్తం సంక్షేమపథకాలకు అర్హులైన నిరుపేదలందరు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీతకృపయ్య, ఎంపీడీఓ అవిరెండ్ల జానయ్య, ఎంపిఓ సంగీత,సర్పంచులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, వల్లంపట్ల ఝాన్సీ ప్రవీణ్ ,ఉప సర్పంచ్ కోల సైదులు , తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కాంగ్రెస్ పార్టీశ్రేణులు,బిఎల్అర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking