కొండ మల్లె పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమం ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.
మంగళ వారం ఇంచార్జి జిల్లా కలెక్టర్ కొండ మల్లేపల్లి మండలం దేవరోని తండా, చిన్న అడిశర్ల పల్లి
గ్రామాలలో, దేవరకొండ మున్సిపాలిటీ 15వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాలలో దరఖాస్తుల స్వీకరణ ను పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తు దారులతో మాట్లాడి ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు తెలుసుకుని వారికి అవగాహన కలిగించారు.దరఖాస్తు దారులకు దరఖాస్తు నింపడం లో అధికారులు,సిబ్బంది అవగాహన కలిగించాలని సూచించారు.
స్వీకరించిన దరఖాస్తులను విధిగా రిజిష్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా,ప్రస్తుతానికి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ గృహాలు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు,
ప్రజలు ఆయా పథకాలకు అర్హులైన వారు ధరకాస్తు చేసుకోవాలని తెలిపారు.
దేవరోని తండాలో మిర్చి పంట పరిశీలించి అధికారులు, రైతులతో చర్చించారు. మిర్చి పంటను మరింత ప్రోత్సహించాలని అక్కడి రైతులను కోరారు. పత్తి పంట వేసి ఆర్థిక ఇబ్బందులతో సిద్ధమవుతూ అవుతున్నందున దాని స్థానంలో మిర్చి పంట వేసుకుంటున్నట్లు రైతులు కలెక్టర్ కు వివరించారు.
ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను క్రమ పద్ధతిలో ప్రభుత్వము పరిష్కరిస్తుందని వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి. ఓ శ్రీరాములు,కొండ మల్లేపల్లి మండల ప్రత్యేక అధికారి,చేనేత జౌళి శాఖ ఏ.డి. ద్వారక్, తహశిల్దార్ దివ్య రెడ్డి, ఎంపీడీవో బాలరాజ్, ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు సర్పంచ్ లు ఇస్లావత్ రాకేష్, గడ్డం శ్రీరాములు, దేవరకొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, కౌన్సిలర్ రహత్ అలీ, కమిషనర్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.