ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

భైరవునిపల్లిలో ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి గ్రామంలో చదువుల తల్లి సావిత్రి బాయి పూలే 193వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.సావిత్రి బాయి పూలే ఫోటో కి పూలతో నివాళ్ళు అర్పించారు. అనంతరం ఈ కార్యమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ ఐడియాలాజిస్ట్ పెద్దపాక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే దేశములో మహిళా పాఠశాల ను ఏర్పాటు చేసి చదువు నేర్పించిన మహిళా మూర్తి సామాజిక విప్లవానికి కి నంది పలికి మూఢనమ్మకాలుకు వ్యతిరేకంగా వితంతు వివాహలను ప్రోత్సహించిన గొప్ప సంఘ సేవకురాలిగా తన భర్త జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యాసోదిక్ సమాజ్ ద్వారా మహిళా ఎదురుకుంటున్న సమస్యలు పై పోరాటం చేసిన దీరావనితా సావిత్రి బాయి పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో మరికంటి రమేష్ కళాకారుడు పెద్దపాక విజయ్ కుమార్ గోపి ఉపేందర్ మాతంగి రత్నం అంబేద్కర్ జగజీవన్ రావు యూత్ అధ్యక్షులు ముప్పిడి రమేష్ గండు సైదులు కుక్కల వెంకటేశ్వర్లు పెద్దపాక భాస్కర్రావు మల్లెబోయిన శ్రీను మాతంగి రాజా పొలంపల్లి నారాయణ పొలంపల్లి శ్రీను తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking