ప్రజాపాలన ప్రతిష్టాత్మకం

ప్రజాపాలన ప్రతిష్టాత్మకం

మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఆరు వార్డులలో ప్రజా సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బుధవారం జనవరి 3, 2024 రోజున వార్డ్ నెం. 25 వార్డ్ నెం. 26 వార్డ్ నెం.27 వార్డ్ నెం.28 వార్డ్ నెం. 29 వార్డ్ నెం. 30 వార్డులలో వార్డు సభ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.

మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు వార్డ్ నెం.25 అబ్బాసియా కాలనీలోని అంగన్వాడి సెంటర్ దగ్గర నిర్వహించిన ప్రజాసభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెం.26 గాంధీ పార్క్, వార్డ్ నెం.27 షేర్ బంగ్లా, వార్డ్ నెం.28 యాదవ సంఘం, వార్డ్ నెం. 29 లైన్ వాడి అర్బన్ హెల్ప్ సెంటర్ దగ్గర మరియు వార్డ్ నెం.30 కమ్యూనిటీ హాల్ లలో వార్డు సభ కార్యక్రమంలో కమిషనర్  పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వార్డ్ ఆఫీసర్లు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల గూర్చి ప్రభుత్వం వద్ద నుంచి ఎటువంటి ఫార్మేట్ రాలేదని, వాట్స్అప్ లలో వచ్చే ఫార్మేట్ ను ప్రజలు ఎవరు నమ్మొద్దని స్పష్టం చేశారు.
ఎటువంటి జిరాక్స్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు ఫారాలను తీసుకోవద్దని పేర్కొన్నారు.
అందుబాటులో కావలసినన్ని దరఖాస్తులను ఉంచామని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. 6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డ్ ప్రజలు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking