ఉద్యోగుల సంక్షేమానికి కృషి
బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రైతుల, మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తానని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్అర్ ఆన్నారు. బుధవారం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎమ్మేల్యే బిఎల్అర్ ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానన్నారు. రైతు ధాన్యానికి గిట్టుబాటు ధర రాకుంటే మార్కెట్ గోదాముల్లో ధాన్యంనిల్వ చేసుకుని 75 శాతం రుణ సౌకర్యం పథకం రైతుబంధు ఉందని, రైతులు సద్వినియోగం చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మార్కెటింగ్ శాఖ టీఎన్ జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలక నర్సింహారెడ్డి అన్నారు. మార్కెటింగ్ శాఖలో ఉద్యోగులకు 3 నెలలుగా వేతనాలు రాని పరిస్థితి ఏర్పడిందని, మెరుగు పర్చేందుకు చొరవ చూపాలని ఆయన అన్నారు. ఎమ్మేల్యే కానప్పుడు ధాన్యం అమ్ముకునేందుకు రైస్ మిల్లుల వద్ద పడిగాపులు పడ్డ రైతులకు అన్నం అందించిన బిఎల్అర్ రైతులకు మెలే చేస్తారని ఆయన అన్నారు. తొలుత బిఎల్ఆర్ ను మహారాజ టోపీ పెట్టి గజమాల, 200 నోటు బుక్కులతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ ది. స్కై లాబ్ నాయక్, దామరచర్ల ఎంపిపి డి.నందిని రవితేజనాయక్, నాయకులు నాగునాయక్, టీఎన్ జీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి. ముక్రం, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుబాబు, మహేష్, స్థానిక మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, కిరణ్ కుమార్, శ్రవణ్, సహాయ కార్యదర్శి సైదులు, గిరి, సిబ్బంది పురం రవిలు పాల్గొన్నారు.