టెలికాం అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్ గా పోకల
గరిడేపల్లి, అక్షిత న్యూస్ :
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో అత్యున్నతమైన టెలికాం అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్ గా పోకల వెంకటేశ్వర్లు నియామకం హర్షనీయం. తెలంగాణ మలిదశ పోరాట ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర నిర్వహించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే తనదైనటువంటి చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం. నాడు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా, హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి, నేడు భారతీయ జనతా పార్టీ పేట జిల్లా ఉపాధ్యక్షుడిగా, పెన్ పహాడ్ మండల ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు. అతడి అంకితభావం , నిస్వార్థ రాజకీయ జీవితానీకి గుర్తింపుగా నేడు ఈ పదవి వివరించడం శుభ పరిణామం. ఇందుకు సహకరించిన గురువర్యులు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, తన వెన్నంటి సహకరించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు.