ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం..*

*ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం..*
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఆలయ ప్రతిష్ట ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి
అందోలు, అక్షిత ప్రతినిధి :
ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. అందోలు మండలంలోని నేరడి గుంట గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ హనుమాన్, దుర్గామాత ఆలయల ప్రతిష్టాపన ఉత్సవాలలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామదేవతల ప్రతిష్ఠాపనోత్సవాలు పెద్దఎత్తున జరగడం ఆనందంగా ఉందన్నారు. మానవ జన్మకు భక్తి మార్గం తప్ప వేరే మార్గం తో ముక్తి లభించదని అలాంటి భక్తి మార్గం ఎంచుకొని రెండు ఆలయాలు నిర్మించి ముక్తి మార్గం ఎంచుకున్న సర్పంచ్ చందులత వీరమళ్లప్ప ను అభినందించారు. అందరూ మంచి మార్గంలో నడుస్తూ మంచి పనులు చేయాలని కోరారు.దామోదర రాజనర్సింహ వెంట జిల్లా మండల నాయకులు మరియు నేరడిగుంట పుర ప్రముఖులు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking