*లేఖానంద స్వామి ఇకలేరు
గరిడేపల్లి, అక్షిత న్యూస్ :
ప్రముఖ రచయిత, రంగస్థలం కళాకారుడు డాక్టర్ లింగనబోయిన లేఖానంద స్వామి ఈ సాయంకాలం గుండెపోటుతో చనిపోయినారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం లోని అప్పన్నపేట గ్రామానికి చెందిన డాక్టర్ లింగన్న బోయిన లేఖనంద స్వామి అతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినాడు. ఈయన రాఘవేంద్ర డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా తన సేవలు అందించినాడు. చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తిని కనపరిచి, అనేక నాటకాలను రచించినాడు. ఆ తరువాత కథలు, పద్యాలు వంటి సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రను కనపరిచినాడు. డాక్టరేట్ పట్టాను సాధించినాడు. ఇట్లా తన జీవిత ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లేఖనంద స్వామి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం బాధాకరం. లేఖానంద స్వామి మృతి పట్ల పలువురు కవులు, రచయితలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినారు. లేఖనంద స్వామి గారి అంత్యక్రియలు రేపు ఉదయం నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేసినారు.