ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
పాఠశాలల ఆకస్మిక తనిఖీ

విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం

కోదాడ, అక్షిత ప్రతినిధి :
పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆదేశించారు. సోమవారం కోదాడ పట్టణంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోదాడ బాలుర, కోదాడ బాలికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, విద్యావిధానం, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్న తీరు తదితర అంశాలపై ఆరా తీశారు. రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు.

ఆయన వెంట విద్యాశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ విజయలక్ష్మి, సూర్యాపేట, నల్గొండ డిఈఓలు కే. అశోక్, బిక్షపతి, శ్రావణ్, మండల విద్యాశాఖాధికారి సలీం షరీఫ్ తదితరులున్నారు. బుర్ర వెంకటేశం ను మండల విద్యాశాఖాధికారి సలీం షరీఫ్ శాలువాతో సత్కరించారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking