అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 22 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుల సోమారం లో చోటు చేసుకుంది.ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..చౌటుప్పల్ డివిజన్ డిప్యూటీ తాసిల్దార్ సివిల్ సప్లై అధికారి బాలమణి కి టేకుల సోమరంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఆమె ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి పడమటివారి గూడెం శివారులోని పడమటి పాండురంగారెడ్డి భూమిపై తనిఖీలు చేపట్టగా తనిఖీల్లో సుమారు 22 టన్నుల బరువు ఉన్న 400 ప్లాస్టిక్ సంచుల పిడిఎస్ బియ్యం AP10 డబ్ల్యూ 6680 నంబర్ గల డీసీఎం వాహనంలో 250,వ్యవసాయ క్షేత్రంలో 150 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థుల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అక్రమ లాభం కోసం అధిక ధరలకు అమ్ముతున్నట్లు నిందితుడు కోడితాల వెంకటేశ్వర్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో పంచనామ కింద డీసీఎం వాహనాన్ని స్వాధనం చేసుకున్నారు.సివిల్ సప్లై అధికారి బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్న కొడితల వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.