ఆర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి

ఆర్జీలను జాప్యం
లేకుండా పరిష్కరించాలి

కలెక్టర్ హరి చందన

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఆర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి వారి సమస్యలపై ఆర్జిలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్జీదారులు సమర్పించిన ఆర్జీల పై జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులను తన వద్దకు పిలిపించుకొని వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొన్నారు. అలాగే మరి కొన్ని ఆర్జిల పరిష్కారానికి పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.


ఈ ప్రజావాణి కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా అధికారులు హాజరై ప్రజలవద్దనుండి ఆర్జీలను స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking