ప్రభుత్వం – ప్రజలకు మధ్య వారధిలు పత్రికలే
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
– అక్షిత జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరణ
నకిరేకల్ అక్షిత ప్రతినిధి :
ప్రభుత్వానికి ప్రకలకి మధ్య వారధిగా పత్రికలు పని చేయలన్, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాటి పాత్ర కీలకమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ మాతంగి దాస్ అధ్వర్యంలో వెలువడుతున్న “అక్షిత జాతీయ” తెలుగు దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను సోమవారం తన క్యాంప్ కార్యాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో కీలక పాత్ర వహించాలన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా అక్షిత జాతీయ దిన పత్రిక నిలిచిందన్నారు. పత్రికలో ప్రచురిస్తున్న అవినీతి వార్తల పై వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. అదే విధంగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య వారధిగా పత్రిక నిలవడం అభినందించ దగ్గ విషయమన్నారు.

రాబోయే రోజుల్లో ఈ పత్రిక ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కోరుకుంటున్నామన్నారు. నిర్భయంగా వార్తలను అందిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన వార్తలను అందిస్తూ అక్షిత జాతీయ దినపత్రిక ప్రజలకు బలం, బలగంగా మారిందన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో ముత్యాల రమేష్, నీర్నెముల గ్రామ మాజీ వార్డు మెంబెర్ నోముల ప్రవీణ్ కుమార్ , కాంగ్రెస్ యూత్ నాయకులు ఏటెల్లి పరమేష్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.